TG: ప్రభుత్వ పాఠశాల టాయిలెట్‌లో రహస్య కెమెరా

TG: ప్రభుత్వ పాఠశాల టాయిలెట్‌లో రహస్య కెమెరా
X
వాష్‌రూమ్‌లో కెమెరా గుర్తించిన బాలికలు.. తల్లిదండ్రులకు తెలిపిన విద్యార్థినులు.. కరీంనగర్ జిల్లాలో అటెండర్ దారుణం

మృ­గా­ళ్ల దా­రు­ణా­ల­తో బా­లి­క­ల­కు రక్ష­ణే లే­కుం­డా పో­తోం­ది. బడి­కి­పో­తే పి­చ్చి పి­చ్చి చే­ష్ట­లు చే­స్తూ ఇబ్బం­ది­ప­ట్టే ఉపా­ధ్యా­యు­లు రూ­పం­లో ఉన్న కా­మాం­ధు­లు కొం­ద­రై­తే.. అమ్మా­యి వాష్ రూ­మ్స్‌­లో రహ­స్య కె­మె­రా­లు పె­ట్టి వీ­డి­యో­లు రి­కా­ర్డు చేసి.. వి­కృత ఆనం­దం పొం­దే మా­రీ­చు­లు మరి­కొం­ద­రు. తా­జా­గా కరీం­న­గ­ర్ జి­ల్లా కు­రి­క్యాల ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­లో­ని బా­లి­కల వాష్ రూమ్ లో రహ­స్య కె­మె­రా బయ­ట­ప­డ­డం తీ­వ్ర కల­క­లం రే­పిం­ది. అమ్మా­యిల బా­త్రూ­మ్‌­లో అటెం­డ­ర్‌ యా­కూ­బ్‌ సీ­క్రె­ట్ కె­మె­రా­ను పె­ట్టి.. వీ­డి­యో­లు రి­కా­ర్డు చే­స్తు­న్నా­డు. బా­త్రూ­మ్‌­లో ఓ పరి­క­రం మె­రు­స్తూ ఓ పరి­క­రం బా­లి­కల కం­ట­ప­డిం­ది. ఏంటా అని చెక చే­య­గా.. రహ­స్య కె­మె­రా అని గు­ర్తిం­చా­రు. వెం­ట­నే హె­డ్మా­స్ట­ర్‌­కి, తల్లి­దం­డ్రు­ల­కి ఫి­ర్యా­దు చే­శా­రు. బా­త్రూ­మ్‌ నుం­చి కె­మె­రా తరహా పరి­క­రం స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు పో­లీ­సు­లు. ఆగ్ర­హం­తో తల్లి­దం­డ్రు­లు పా­ఠ­శాల వద్ద­కు చే­రు­కొ­ని నిం­ది­తు­డి­పై చర్య­లు తీ­సు­కో­వా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు.ఈ ఘట­న­తో గ్రా­మం­లో ఉద్రి­క్తత వా­తా­వ­ర­ణం నె­ల­కొం­ది. ఈ దా­రు­ణా­ని­కి ఒడి­గ­ట్టిం­ది ఆ పా­ఠ­శా­ల­కు చెం­దిన అటెం­డ­ర్ యా­కూ­బ్‌ అని తే­లిం­ది. ఇతను సీ­క్రె­ట్ కె­మె­రా­ను అమ­ర్చి.. వీ­డి­యో­లు రి­కా­ర్డు చే­స్తూ వి­కృత ఆనం­దం పొం­దు­తు­న్న­ట్లు పో­లీ­సు­లు అను­మా­ని­స్తు­న్నా­రు.

అంతే కా­కుం­డా.. అటెం­డ­ర్ యా­కూ­బ్ బా­లి­కల ఫొ­టో­లు తీసి వా­టి­ని అశ్లీల చి­త్రా­లు­గా మా­ర్ఫిం­గ్ కూడా చే­స్తు­న్న­ట్లు సమా­చా­రం. బా­లి­క­లు, వారి తల్లి­దం­డ్రు­లు వెం­ట­నే ఈ వి­ష­యా­న్ని హె­డ్‌­మా­స్ట­ర్‌­కు ఫి­ర్యా­దు చే­శా­రు. హె­డ్‌­మా­స్ట­ర్ ఫి­ర్యా­దు మే­ర­కు పో­లీ­సు­లు రం­గం­లో­కి ది­గా­రు. పో­లీ­సు­లు వా­ష్‌­రూ­మ్‌ నుం­చి కె­మె­రా తరహా పరి­క­రా­న్ని స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. ఈ పరి­క­రం­లో ఉన్న రి­కా­ర్డుల ఆధా­రం­గా దర్యా­ప్తు­ను వే­గ­వం­తం చే­శా­రు. నిం­ది­తు­డైన అటెం­డ­ర్ యా­కూ­బ్ ఈ వి­ష­యం బయ­ట­ప­డ­టం­తో­నే పరా­రీ­లో ఉన్నా­డు. స్కూ­ల్ వా­తా­వ­ర­ణం­లో ఇలాం­టి ఘట­న­లు జర­గ­డం దా­రు­ణం. ఈ ఘట­న­తో వి­ద్యా­ర్థుల తల్లి­దం­డ్రు­లు తీ­వ్ర ఆవే­ద­న­కు గు­ర­వు­తు­న్నా­రు. ఈ వ్య­వ­హా­రా­ని­కి పా­ల్ప­డిన వ్య­క్తి­ని కఠి­నం­గా శి­క్షిం­చా­ల­ని వి­ద్యా­ర్థు­లు తల్లి­దం­డ్రు­లు ప్ర­భు­త్వా­న్ని డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు. వి­ద్యా­బు­ద్ధు­లు నే­ర్చు­కో­వా­ల్సిన చోటే.. రక్షణ లే­క­పో­వ­డం, కా­మాం­ధుల వి­కృత చే­ష్ట­లు తల్లి­దం­డ్రు­ల్లో తీ­వ్ర ఆం­దో­ళ­న­ను పెం­చు­తు­న్నా­యి. ఇలాం­టి ఘట­న­లు పా­ఠ­శా­ల­ల్లో­ని భద్ర­తా ప్ర­మా­ణా­ల­పై ప్ర­శ్న­ల­ను లే­వ­నె­త్తు­తు­న్నా­యి. నిం­ది­తు­డు యా­కూ­బ్ ను పో­లీ­సు­లు వి­చా­రి­స్తు­న్నా­రు.

Tags

Next Story