TG: స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తెలంగాణ హైకోర్టు నుంచి పెద్ద అడ్డంకి ఎదురైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. నేడు విడుదలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 పై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌పై వివిధ పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు తమ వాదనలో ప్రభుత్వ జీవో ద్వారా ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరుగుతోందని.. కొన్ని వర్గాలకు అనుకూలంగా మార్పులు జరిగాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు, జీవో నంబర్ 9( బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన) అమలుపై Stay విధించింది. అంతే కాకుండా.. ఈ రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి విడుదలైన నోటిఫికేషన్‌పై కూడా స్టే విధించింది హైకోర్టు. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోనుంది.
సుదీర్ఘ వాదనలు..
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6శాతం ఉన్నట్లు తేలిందన్న ఆయన.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే.. అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. మరో న్యాయవాది రవివర్మ తన వాదనలు వినిపిస్తూ... రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50శాతం సీలింగ్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, 85 శాతం జనాభాకు 42 శాతంతో కలిపి 67 శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్‌గానే ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ సర్కారు?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావడానికి కారణమవుతుందేమోననే భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోయే నెక్ట్స్ స్టెప్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీసీ సంఘాల ఒత్తిడితో సర్కారు సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. దీని కోసం న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని ఆలోచనలు చేస్తోందని సమాచారం. ఉన్నత న్యాయస్థానం నిర్ణయంతో బీసీల నోటి వద్ద ముద్ద లాగేసినట్లయిందని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరతామన్నారు. కోర్టు తీర్పు కాపీ చూసిన తర్వాత ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు. మంత్రి వాకాటి నిర్ణయంతో హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుందనే తెలుస్తోంది. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టు తీర్పుపై బీసీ సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com