TG: తెలంగాణలో హిల్ట్ పాలసీ కలకలం

తెలంగాణ ప్రభుత్వం ఔటర్ లోపల నిరుపయోగంగా ఉన్న పారిశ్రామిక భూములు, కాలుష్య కారక పరిశ్రమల తరలిస్తే ఖాళీగా ఉండే భూముల విషయంలో ఇటీవల హిల్ట్ అనే పాలసీ తీసుకు వచ్చింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP)-2025’ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మంచి అవకాశం అని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ లోపలి, సమీపంలో ఉన్న 9,292 ఎకరాల పాత ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను రెసిడెన్షియల్, కమర్షియల్, IT, మల్టీ-యూజ్ జోన్లుగా మార్చేందుకు ఈ పాలసీ అవకాశం కల్పిస్తోంది. యల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇళ్ల ధరలను తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 50-60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాత ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలోకి చేరాయి. ఇవి కాలుష్యం కారకంగా మారాయి. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ల్యాండ్‌ను మల్టీ-యూజ్‌గా మార్చాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు హిల్ట్ పాలసీ వెనుక వేల కోట్లు కుంభకోణం ఉందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయగా.. బీజేపీ నేతలకు హిల్ట్ పాలసీపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్‌ను కలిసింది. హిల్ట్ పాలసీ పేరుతో రూ.వేలకోట్ల కుంభకోణం జరుగుతోందని ఫిర్యాదు చేసింది. అక్రమాలు జరగకుండా చూడాలని వినతిపత్రం అందజేసింది. గవర్నర్‌ను కలిసిన వారిలో భాజపా శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, ఎన్వీ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్’ (హిల్ట్) పాలసీని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్) అతిపెద్ద భూకుంభకోణమని, దాని గురించి కాంగ్రెస్ హై కమాండ్‌కు తెలుసా? లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద భూ కుంభకోణమని, రూ.5 లక్షల కోట్ల స్కామ్ అని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ ఈ మేరకు లేఖ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

