TG: "ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు"

తెలంగాణలోని మహిళలను కోటీశ్వరులను చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గ్రేటర్‌పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ‘‘మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. మహిళలను ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. మరో 450 బస్సులకు యజమానులను చేయబోతున్నాం. మహిళలు ఇక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు’’ అని భట్టి అన్నారు. కాంగ్రెస్ పాలన ప్రజా రంజకంగా సాగుతోందని వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులున్నా 50 వేల మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ వడ్డీలేని రుణాలు ఇస్తుందని కార్మికశాఖ మంత్రి వివేక్ వెల్లడించారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి ..మహిళలను ఆర్థికంగా నిలదొక్కకునేలా చేయడానికే ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా 50 వేల మహిళా సంఘాలకు మహిళా సంఘాలకు ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నామన్నారు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి సీతక్క అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయి. రుణాలు తీసుకుని లక్షల మంది లబ్ది పొందుతున్నారని సీతక్క వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com