TG: కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఈ క్రమంలోనే.. రేవంత్ సర్కార్.. కొత్తగా మంజూరైన వారికి రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి..ఈ నెల 14న తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీకార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తిరిమలగిరి వేదికగా జూలై 14న సీఎం రేవంత్రెడ్డి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 5 లక్షల కొత్త కార్డులను ఇవ్వబోతున్నామన్నారు. అంతేకాదు, కుటుంబ సభ్యులను రేషన్ కార్డులలో చేర్చుతున్నామని చెప్పారు. దీంతో తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరనుందని తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా సాగుతుందని స్పష్టం చేశారు. జూలై 14 న 5 లక్షల కార్డులు నూతనంగా ఇవ్వబోతున్నామని, అదనంగా కుటుంబ సభ్యులని రేషన్ కార్డులలో చేర్చుతున్నామని తెలిపారు.
దీంతో తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరనుందని అన్నారు. 13000 కోట్ల రూపాయలు ద్వారా 3.10 కోట్ల మందికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇచ్చి 95 లక్షల కుటుంబాలకి చెందిన పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చటం,అర్హులందరికీ రేషన్ కార్డుల ఇవ్వటం అనేవి నాకు చాలా సంతోషం, సంతృప్తి ని ఇచ్చాయని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత వందేళ్లలో భారతదేశంలోని ఏ రాష్ట్రం చేయని బీసీ కులగణన విజయవంతం చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి, బీసీలకి స్థానిక సంస్థ ఎన్నికలలో 42 శాతం అమలు కొరకు చట్టం తెచ్చామని, జూలై 10న నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో బీసీలకి 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థ ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజల కోరిక మేరకు ఎస్సి వర్గీకరణ చేశామని బిసి కులగణన, ఎస్సి వర్గీకరణ చేశామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com