Rains Updates: ఈరోజు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

Rains Updates: ఈరోజు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు..

రాగల ఐదురోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటకను ఆనుకొని ఉన్న తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనంపై నుంచి ద్రోణి ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక, తెలంగాణను ఆనుకొని ఉన్న ఆగ్నేయ ఆరేబియా సముద్రం మీదుగా కేరళగుండా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు విస్తరించి ఉందని తెలిపింది.

ఆదివారం నుంచి సోమవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం పేర్కొంది.

Tags

Next Story