TG : తెలంగాణ రైజింగ్.. తొలి రోజే రూ. 3,97,500 కోట్ల పెట్టుబడులు

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’లో తొలి రోజే పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు తొలి రోజైన సోమవారం రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సమిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ‘వంతార’... తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి వన్యప్రాణుల సంరక్షణ, నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దేశంలో వన్యప్రాణుల పునరావాస వ్యవస్థ మెరుగుతో పాటు శాస్త్రీయ సంరక్షణ, పరిశోధన, ప్రజలకు అవగాహన, నైట్సఫారీ అనుభవాలను పంచనుంది. దీనికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను వంతార బృందం వివరించింది. పర్యాటక, అటవీ, పర్యావరణ శాఖలు అవసరమైన సహాయం అందించేందుకు అంగీకరించాయి. వన్యప్రాణి సంరక్షణ, నైట్సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చినందుకు సీఎం రేవంత్ అభినందించారు. పర్యాటకం పెరగడంతో పాటు స్థానికంగా ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయస్థాయి నాణ్యతతో కూడిన రేసింగ్, మోటోక్రాస్ సదుపాయాన్ని అభివృద్ధి చేసేందుకు ‘సూపర్‌క్రాస్ ఇండియా సంస్థ’ ముందుకొచ్చింది.
అమెరికా అధ్యక్షుడు కంపెనీ..
భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు తామము సిద్ధంగా ఉన్నామని ఎరిక్ వెల్లడించారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పోరేషన్ లో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన డోనాల్డ్ ట్రంప్ రివోకబుల్ ట్రస్ట్‌కు 52 శాతం వాటా ఉంది. ఈ ట్రస్ట్ కింద మరిన్ని కంపెనీలు ఉన్నాయి. ఫ్లోరిడా లోని సరసోటా కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తరచూ పోస్టులు చేసే ట్రూత్ సోషల్ను కూడా ఈ కంపెనీ నిర్వహిస్తోంది. కాగా, హైదరాబాద్‌లో ఓ ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే
పెట్టుబడుల ప్రవాహం
అంతర్జాతీయ రేసింగ్ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ట్రాక్‌లు, రైడర్ ట్రైనింగ్ జోన్లు, ప్రేక్షకులకు మౌలిక సదుపాయాలు, అతిథ్య సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రతిపాదిత లేఅవుట్‌ను సంస్థ ప్రదర్శించింది. మోటార్ స్పోర్ట్ హబ్ హైదరాబాద్‌ను స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ కారిడార్‌గా మార్చనుంది. ఈ గమ్యస్థానం జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లకు ఆతిథ్యమివ్వనుంది. మోటార్ స్పోర్ట్ పర్యాటకంతో పాటు కోచింగ్, ఈవెంట్స్ నిర్వహణ ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచుతుంది. రాష్ట్రంలో రూ.10 వేల కోట్లతో సమీకృత టౌన్షిప్, ప్రపంచస్థాయి ఫిల్మ్ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు సల్మాన్‌ఖాన్ వెంచర్స్ సంస్థ ప్రణాళిక ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

