TG: తెలంగాణలో రిలయన్స్ "వంతార"

రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ‘వంతార’... తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి వన్యప్రాణుల సంరక్షణ, నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దేశంలో వన్యప్రాణుల పునరావాస వ్యవస్థ మెరుగుతో పాటు శాస్త్రీయ సంరక్షణ, పరిశోధన, ప్రజలకు అవగాహన, నైట్సఫారీ అనుభవాలను పంచనుంది. దీనికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను వంతార బృందం వివరించింది.
తొలి రోజే పెట్టుబడుల ప్రవాహం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో తొలి రోజే పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు తొలి రోజైన సోమవారం రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సమిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. తెలంగాణ విజన్‌ను ఈ సమిట్ ప్రతిబింబిస్తోందని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ అన్నారు. తెలంగాణలో ఇప్పటికే అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. ‘‘ గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యువబుల్ ఎనర్జీలో ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నాం. సిమెంట్ రంగంలో కూడా అదానీ గ్రూప్ పెట్టుబడులు పెడుతోంది. డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో తొలిసారిగా యూఏవీ టెక్నాలజీ హైదరాబాద్‌లో రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌లో తయారయ్యే యూవీలను సైన్యానికి అందిస్తాం. ప్రపంచమార్కెట్లోనూ విక్రయిస్తాం. రూ.25వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం. లాజిస్టిక్స్‌లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోంది. రూ.4వేల కోట్లతో రహదారి సౌకర్యాలు కల్పించనున్నాం. రాష్ట్రంలో జిల్లాలను కలిపే రహదారులను అదానీ గ్రూప్ నిర్మిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో రూ.10 వేల కోట్లతో సమీకృత టౌన్షిప్, ప్రపంచస్థాయి ఫిల్మ్ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు సల్మాన్‌ఖాన్ వెంచర్స్ సంస్థ ప్రణాళిక ప్రకటించింది. లగ్జరీ ఆతిథ్యం, ఆహ్లాదకరమైన విడిది కేంద్రం, స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలు, పూర్తిస్థాయి ప్రొడక్షన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఈ టౌన్షిప్లో గోల్ఫ్ కోర్సు, రేస్ కోర్సు, ప్రీమియం రెసిడెన్షియల్ స్పేస్‌లు ఉంటాయి. ప్రొడక్షన్స్, ఓటీటీ కంటెంట్, పోస్ట్ ప్రొడక్షన్ సదుపాయాలు తదితర కార్యక్రమాలకు వీలుగా ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ ఉంటుంది. ఈ పెట్టుబడి క్రియేటివ్ సెక్టార్లో కీలకమైందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ తెలంగాణతో ఒప్పందం చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

