TG: తెలంగాణ రాజకీయాల్లో సంచలన మలుపు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి తమ సమాధానం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్ ను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ ఇప్పటికే విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం నాటికి ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా, మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. తమ వినతి మేరకు స్పీకర్ తమకు సమాధానమిచ్చేందుకు గడువు ఇచ్చినట్లూ చెబుతూ వచ్చారు. కానీ, సోమవారం సుప్రీం కోర్టు ఈ ఫిరాయింపుల వ్యవహారం పై స్పీకర్ కు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చింది.
తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టుధిక్కారంపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్‌కి దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్. గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. “మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే.. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి..” అని జస్టిస్ బీఆర్ గవాయి స్పష్టం చేశారు. నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి వెల్లడించారు. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని జస్టిస్ బీఆర్ గవాయి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్ , ముకుల్ రోహత్గి కోర్టుకు చెప్పారు.
తెలంగాణలో పదిమంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన పిటిషన్లపై మూడునెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని జులై 31న జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అయితే విభిన్న కారణాలవల్ల ఆలోపు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కానందున స్పీకర్‌కు మరో రెండునెలలు గడువు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన మిసిలేనియస్ అప్లికేషన్ సీజేఐ ధర్మాసనం ముందు 14వ నంబరులో లిస్ట్ అయింది.
తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు 3 నెలల్లో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది వాదించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

