TG: తెలంగాణలో "మహాలక్ష్మి"కి స్మార్ట్ కార్డులు

TG: తెలంగాణలో మహాలక్ష్మికి స్మార్ట్ కార్డులు
X
తెలంగాణ మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులు... మహాలక్ష్మి పథకానికి సంబంధించిన కార్డులు... కార్డులు త్వరగా సిద్ధం చేయాలని ఆదేశాలు

తె­లం­గా­ణ­లో మహి­ళ­ల­కు అమలు చే­స్తు­న్న మహా­ల­క్ష్మి ఉచిత బస్సు ప్ర­యాణ పథ­కా­న్ని మరింత వ్య­వ­స్థీ­కృ­తం­గా అమలు చే­య­డా­ని­కి ప్ర­భు­త్వం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఈ పథ­కా­ని­కి సం­బం­ధిం­చిన స్మా­ర్ట్‌­కా­ర్డు­ల­ను త్వ­ర­గా సి­ద్ధం చేసి మహి­ళ­ల­కు అం­దిం­చా­ల­ని ఆర్టీ­సీ అధి­కా­రు­ల­ను ప్ర­భు­త్వం ఆదే­శిం­చిం­ది. జూన్ 2వ తేదీ నుం­చి మహి­ళ­ల­కు స్మా­ర్ట్‌­కా­ర్డు­లు జారీ చే­యా­ల­ని సూ­త్ర­ప్రా­యం­గా ని­ర్ణ­యిం­చి­న­ట్లు అధి­కార వర్గాల సమా­చా­రం. రా­ష్ట్ర బడ్జె­ట్‌ సన్నా­హక సమా­వే­శాల భా­గం­గా ఉప­ము­ఖ్య­మం­త్రి, ఆర్థి­క­శాఖ మం­త్రి భట్టి వి­క్ర­మా­ర్క సచి­వా­ల­యం­లో కీలక సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. ఈ సమా­వే­శా­ని­కి రవా­ణా­శాఖ మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్, ఆర్టీ­సీ ఎండీ నా­గి­రె­డ్డి, ఇతర ఉన్న­తా­ధి­కా­రు­లు హా­జ­ర­య్యా­రు. 2026-27 ఆర్థిక సం­వ­త్స­రా­ని­కి సం­బం­ధిం­చిన బడ్జె­ట్ ప్ర­తి­పా­ద­న­ల్లో ఆర్టీ­సీ­కి అవ­స­ర­మైన ని­ధుల కే­టా­యిం­పు­పై చర్చ జరి­గిం­ది. ఈ సం­ద­ర్భం­గా మహా­ల­క్ష్మి పథ­కా­న్ని మరింత సమ­ర్థ­వం­తం­గా అమలు చే­యా­లం­టే స్మా­ర్ట్‌­కా­ర్డుల జారీ అత్య­వ­స­ర­మ­ని అభి­ప్రా­యా­లు వ్య­క్త­మ­య్యా­యి. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో లెక్కలు సరిగ్గా నిర్వహించేందుకు, ప్రయాణాల సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేయడానికి, పారదర్శకతను పెంచడానికి స్మార్ట్‌కార్డుల వినియోగం కీలకమని అధికారులు వివరించారు. మహిళలకు వీలైనంత త్వరగా స్మార్ట్‌కార్డులు అందించాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆర్టీ­సీ ఎండీ నా­గి­రె­డ్డి మూడు రకాల స్మా­ర్ట్‌­కా­ర్డుల నమూ­నా­ల­ను ఉప­ము­ఖ్య­మం­త్రి భట్టి వి­క్ర­మా­ర్క, రవా­ణా­శాఖ మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్‌­ల­కు చూ­పిం­చా­రు. కా­ర్డుల రూ­ప­క­ల్పన, సాం­కే­తిక లక్ష­ణా­లు, చి­ప్‌ ఆధా­రిత సౌ­క­ర్యా­లు వంటి అం­శా­ల­పై వి­వ­రా­లు ఇచ్చి­న­ట్లు సమా­చా­రం. ఈ కా­ర్డు­లు చి­ప్‌­తో కూడి ఉం­డ­టం­తో ప్ర­యాణ వి­వ­రా­లు డి­జి­ట­ల్‌­గా నమో­దు కా­వ­డం, దు­ర్వి­ని­యో­గం తగ్గ­డం, ప్ర­భు­త్వా­ని­కి ఖర్చు­ల­పై స్ప­ష్ట­మైన డేటా లభిం­చ­డం వంటి ప్ర­యో­జ­నా­లు ఉం­టా­య­ని అధి­కా­రు­లు వి­వ­రిం­చా­రు. స్మా­ర్ట్‌­కా­ర్డుల అమ­లు­ను ఒకే­సా­రి రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా ప్రా­రం­భిం­చ­కుం­డా ముం­దు­గా పై­ల­ట్‌ ప్రా­జె­క్ట్‌­గా అమలు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. తొ­లుత ప్ర­తి జి­ల్లా­లో ఒక మం­డ­లా­న్ని ఎం­పిక చేసి అక్కడ ప్ర­యో­గా­త్మ­కం­గా కా­ర్డు­లు జారీ చే­య­ను­న్నా­రు. పై­ల­ట్‌ ప్రా­జె­క్ట్‌­లో సు­మా­రు 5 లక్షల మంది మహి­ళ­ల­కు స్మా­ర్ట్‌­కా­ర్డు­లు ఇవ్వా­ల­ని భా­వి­స్తు­న్నా­రు. ఈ ప్ర­క్రి­య­లో ఎలాం­టి సాం­కే­తిక సమ­స్య­లు తలె­త్తి­నా వా­టి­ని గు­ర్తిం­చి పరి­ష్క­రిం­చి, అనం­త­రం రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా పూ­ర్తి స్థా­యి­లో కా­ర్డు­లు జారీ చే­యా­ల­ని ఆర్టీ­సీ ఉన్న­తా­ధి­కా­రు­లు సూ­చిం­చి­న­ట్లు సమా­చా­రం. స్మా­ర్ట్‌­కా­ర్డుల తయా­రీ­కి సం­బం­ధిం­చిన అం­చ­నా­లు కూడా సమా­వే­శం­లో చర్చ­కు వచ్చా­యి.

Tags

Next Story