TG: ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్‌ పాలసీ

TG: ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్‌ పాలసీ
X
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి..యువత క్రీడల్లో రాణించాలన్న సీఎం... భారత్ బలమైన క్రీడా వేదిక కావాలి

తె­లం­గా­ణ­లో క్రీ­డ­ల­ను ప్రో­త్స­హిం­చ­డం తమ ప్ర­భు­త్వ వి­ధా­న­మ­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. క్రీ­డా వి­ధా­నం­లో రా­జ­కీయ జో­క్యా­న్ని తగ్గిం­చి క్రీ­డా­కా­రుల స్ఫూ­ర్తి­ని పెం­పొం­దిం­చా­ల­ని రా­ష్ట్రం­లో క్రీ­డా పా­ల­సీ­ని-2025 తీ­సు­కు­వ­చ్చా­మ­న్నా­రు. తమ వి­జ­న్ డా­క్యు­మెం­ట్ తె­లం­గాణ రై­జిం­గ్-2047లో స్పో­ర్ట్స్ పా­ల­సీ­ని ఒక అధ్యా­యం­గా పె­ట్టా­మ­న్నా­మ­న్నా­రు. హై­ద­రా­బా­ద్ హె­చ్ఐ­సీ­సీ­లో జరి­గిన ‘ఫస్ట్ ఎడి­ష­న్ తె­లం­గాణ స్పో­ర్ట్స్ కాం­క్లే­వ్’‌లో సీఎం రే­వం­త్ పా­ల్గొ­న్నా­రు. మం­త్రి వా­కి­టి శ్రీ­హ­రి, ఒలిం­పి­క్ పతక వి­జేత అభి­న­వ్ బిం­ద్రా, రా­ష్ట్ర ప్ర­భు­త్వ సల­హా­దా­రు (క్రీ­డ­లు) ఏపీ జి­తేం­ద­ర్‌­రె­డ్డి, శా­ట్‌ చై­ర్మ­న్‌ శి­వ­సే­నా­రె­డ్డి హా­జ­ర­య్యా­రు. అనం­త­రం ‘తె­లం­గాణ స్పో­ర్ట్స్ పా­ల­సీ-2025’ని సీఎం వి­డు­దల చే­శా­రు. ప్ర­పం­చం­తో పోటీ పడా­ల­నే స్పో­ర్ట్స్‌ పా­ల­సీ­ని తీ­సు­కు­వ­స్తు­న్నా­మ­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. క్రీ­డా వి­ధా­నం లే­క­పో­వ­డం వల్ల పట్టణ ప్రాం­తా­ల్లో­ని యువత పె­డ­దోవ పడు­తు­న్నా­ర­ని, క్రీ­డ­ల­ను ప్రో­త్స­హిం­చ­క­పో­వ­డం వల్లే యువత డ్ర­గ్స్‌ తీ­సు­కుం­టు­న్నా­ర­ని సీఎం పే­ర్కొ­న్నా­రు. చదు­వు­ల్లో­నే కాదు.. క్రీ­డ­ల్లో­నూ యువత రా­ణిం­చా­ల్సిన అవ­స­రం ఉం­ద­న్నా­రు. హె­చ్‌­ఐ­సీ­సీ­లో జరి­గిన తె­లం­గాణ స్పో­ర్ట్స్‌ కాం­క్లే­వ్‌­లో ‘తె­లం­గాణ స్పో­ర్ట్స్‌ పా­ల­సీ’ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి ఆవి­ష్క­రిం­చా­రు. సీఎం మా­ట్లా­డు­తూ.. దే­శం­లో నూతన వి­ధా­నా­న్ని ప్ర­వే­శ­పె­ట్టా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని అభి­ప్రా­య­ప­డ్డా­రు. ప్ర­పం­చం­తో పో­టీ­ప­డే మనం.. క్రీ­డ­ల్లో వె­న­క­బ­డి ఉం­డ­డం బా­గా­లే­ద­న్నా­రు. భా­ర­త్‌­కు బల­మైన క్రీ­డా వే­దిక కా­వా­ల­ని.. అం­దు­లో తె­లం­గాణ ప్ర­ధా­నం­గా ఉం­డా­ల­ని రే­వం­త్‌­రె­డ్డి పే­ర్కొ­న్నా­రు. . దేశ క్రీ­డా రం­గం­లో రా­ష్ట్రా­న్ని అగ్ర­గా­మి­గా ని­ల­ప­డం, ఒలిం­పి­క్స్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­లో పత­కా­లు సా­ధిం­చే క్రీ­డా­కా­రు­ల­ను తయా­రు చే­య­డ­మే లక్ష్యం­గా ప్ర­భు­త్వం కొ­త్త స్పో­ర్ట్స్ పా­ల­సీ­ని రూ­పొం­దిం­చిం­ది.

తెలంగాణకు నూతన క్రీడాపాలిసీ..

ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల యువత వ్యసనాలకు బానిస అవుతున్నారన్నారు. ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్ల మాదక ద్రవ్యాలు మన వైపు దూసుకువస్తున్నాయన్నారు. పోరాట స్ఫూర్తి ఉన్న తెలంగాణ ప్రాంతం క్రీడల్లో రాణించాలని కోరారు. ప్రపంచంతోనే పోటీపడి దేశానికి మంచి పేరు తీసుకురావాలని తెలంగాణకు నూతన క్రీడాపాలిసీని తీసుకువచ్చినట్లు చెప్పారు. క్రీడామైదానాలు వివాహాలు చేసుకునే ఫంక్షన్ హాళ్లుగా లేదా సన్ బర్న్ ఈవెంట్ చేసుకునే వేదికగా మారిందన్నారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని స్పష్టమైన క్రీడా విధానం, స్పోర్ట్స్, యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎందరో గొప్ప గొప్ప క్రీడాకారులు హైదరాబాద్ నుంచి ఉన్నారన్నారు.

అయిదు ప్రధాన అంశాలతో క్రీడా పాలసీ

అయి­దు ప్ర­ధాన అం­శా­ల­తో తె­లం­గాణ క్రీ­డా పా­ల­సీ రూ­ప­క­ల్పన చే­శా­మ­ని మం­త్రి వా­కి­టి శ్రీ­హ­రి తె­లి­పా­రు. క్రీ­డల అభి­వృ­ద్ధి, స్కి­ల్ డె­వ­ల­ప్ మెం­ట్, మౌ­లిక సదు­పా­య­లు ఈ పా­ల­సీ­లో ఉం­టా­య­న్నా­రు. రా­ష్ట్రం­లో పటి­ష్ట­మైన క్రీ­డా వి­ధా­నా­న్ని రూ­పొం­దిం­చా­మ­ని పా­ర­ద­ర్శ­క­మైన జవా­బు­దా­రి­త­నం ఈ పా­ల­సీ­లో ఉం­డ­బో­తు­న్న­ద­న్నా­రు. స్పో­ర్ట్స్ పా­ల­సీ­పై ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి ని­త్యం ఆరా తీ­స్తు­న్నా­ర­ని చె­ప్పా­రు. ము­ఖ్య­మం­త్రి దూ­ర­దృ­ష్టి­తో గ్రా­మీణ క్రీ­డా­కా­రుల ప్ర­తి­భ­ను వె­లి­కి తీసే ప్ర­య­త్నం చే­స్తు­న్నా­మ­న్నా­రు. దే­శం­లో­నే స్పో­ర్ట్స్ లో తె­లం­గాణ ఇతర రా­ష్ట్రా­ల­కు ఆద­ర్శం­గా మా­రా­ల­న్నా­రు. గ్రామ స్థా­యి క్రీ­డా­కా­రు­ల­ను వె­లి­కి తీసి అం­త­ర్జా­తీయ క్రీ­డా­కా­రు­లు­గా తీ­ర్చి­ది­ద్దు­తా­మ­ని చె­ప్పా­రు. మని రా­ష్ట్రం­లో త్వ­ర­లో­నే స్పో­ర్ట్స్ యూ­ని­వ­ర్సి­టీ ఏర్పా­టు చే­య­బో­తు­న్నా­మ­న్నా­రు.

Tags

Next Story