TG: ప్రపంచాన్ని ఆకర్షించేలా తెలంగాణ గ్లోబల్ రైజింగ్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అజెండా ఖరారైంది. సోమ, మంగళవారాల్లో ఫ్యూచర్‌సిటీ వేదికగా ఈ సమిట్ జరగనుంది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రెండ్రోజుల సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్నారు.
8, 9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని ‘ఫ్యూచర్ సిటీ’లో 100 ఎకరాల విస్తీర్ణంలో సదస్సు నిర్వహిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు హాజరు కానుండడంతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికలు సిద్ధమవుతున్నాయి. 9న సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్లో పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా పాల్గొననున్నారు. క్రియేటివ్ సెషన్లో రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా పాల్గొంటారు. ‘తెలంగాణ రైజింగ్–2047 గ్లోబల్ సమిట్’కు రావాలని జమ్మూ-కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలోని జమ్మూకాశ్మీర్ హౌస్‌లో సీఎం అబ్దుల్లాను మంత్రి కలిసి, ఆహ్వాన పత్రికను అందజేశారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతున్నదని ఉత్తమ్.. అబ్దుల్లాకు వివరించారు.
మీనాక్షికి సహాయకుల నియామకం
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఇద్దరు సహాయకులను ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం నియామించింది. రోజువారీ కార్యక్రమాల కోసం సహాయకులుగా TPPC ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రవీణ్ కుమార్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయన్న పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ అధికారికంగా ప్రటించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మీనాక్షి చర్యలు తీసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

