TG: సీబీఐ రాక.. తెలంగాణలో రాజకీయ కాక

TG: సీబీఐ రాక.. తెలంగాణలో రాజకీయ కాక
X
తెలంగాణలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్న సీబీఐ... సీబీఐపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్న ప్రభుత్వం

తె­లం­గా­ణ­లో కీలక పరి­ణా­మం చో­టు­చే­సు­కుం­ది. కా­ళే­శ్వ­రం అవ­క­త­వ­క­ల­పై రా­ష్ట్ర ప్ర­భు­త్వం సీ­బీఐ దర్యా­ప్తు­న­కు ని­ర్ణ­యిం­చిం­ది. కా­ళే­శ్వ­రం ని­వే­ది­క­పై అసెం­బ్లీ­లో సు­దీ­ర్ఘ చర్చ తర్వాత సీ­బీఐ దర్యా­ప్తు­పై ప్ర­భు­త్వం ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఈ క్ర­మం­లో సీ­బీ­ఐ­కి కేసు అప్ప­గిం­చేం­దు­కు ప్ర­త్యేక ప్రొ­సీ­జ­ర్‌­ను తీ­సు­కు­వ­చ్చా­రు. రా­ష్ట్రం­లో­కి సీ­బీఐ రా­క­పై ఉన్న ని­షేధ ఉత్త­ర్వు­ల­ను ప్ర­భు­త్వం ఉప­సం­హ­రిం­చు­కుం­ది. 2022లో రా­ష్ట్రం­లో­కి సీ­బీఐ రా­క­పై అప్ప­టి బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ప్ర­భు­త్వం ని­షే­ధం వి­ధిం­చ­గా.. ప్ర­స్తు­తం ఆ ని­షే­ధా­న్ని ఉప­సం­హ­రిం­చు­కు­నేం­దు­కు రే­వం­త్ సర్కా­ర్ పూ­ను­కుం­ది. అసెం­బ్లీ­లో కా­ళే­శ్వ­రం­‌­పై చే­సిన తీ­ర్మా­నం కా­పీ­తో పాటు వి­జి­లె­న్స్ ఎం­క్వై­రీ రి­పో­ర్టు, జస్టి­స్ చం­ద్ర­ఘో­ష్ రి­పో­ర్టు­ల­ను జత చేసి సీ­ఎ­స్ రా­మ­కృ­ష్ణ రావు ఆధ్వ­ర్యం­లో నీటి పా­రు­దల శాఖ ఉన్న­తా­ధి­కా­రు­లు కా­ళే­శ్వ­రం­పై సీ­బీఐ వి­చా­రణ జరి­పిం­చా­ల­ని కేం­ద్ర హోం­శా­ఖ­కు లే­ఖ­ను రా­సేం­దు­కు సి­ద్ధ­మై­న­ట్లు­గా సమా­చా­రం. రా­ష్ట్రం నుం­చి లేఖ అం­దిన వెం­ట­నే సీ­బీఐ స్పె­ష­ల్ టీ­మ్‌­తో కా­ళే­శ్వ­రం అవ­క­త­వ­క­ల­పై వి­చా­ర­ణ­ను ప్రా­రం­భిం­చ­ను­న్న­ట్లు­గా వి­శ్వ­స­నీ­యం­గా తె­లు­స్తోం­ది. సీ­బీఐ, ఈడీ బీ­జే­పీ జేబు సం­స్థ­లు అని స్వ­యం­గా కాం­గ్రె­స్ పా­ర్టీ అగ్ర­నేత రా­హు­ల్ గాం­ధే కేం­ద్ర ప్ర­భు­త్వం­పై దు­మ్మె­త్తి పో­స్తు­న్న తరు­ణం­లో రే­వం­త్ రె­డ్డి సర్కా­ర్ తీ­సు­కు­న్న ఈ ని­ర్ణ­యం రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల్లో ఎలాం­టి పరి­ణా­మా­ల­కు దారి తీ­య­బో­తు­న్న­దో అనే­ది ఉత్కంఠ రే­పు­తోం­ది. కేసీఆర్, హరీశ్ రావు వంటి దిగ్గజ నేతల పేర్లు ఉండడం సంచలనం రేపుతోంది.

మండలిలో బీఆర్ఎస్ రచ్చ

తె­లం­గాణ శాసన మం­డ­లి­లో భారత రా­ష్ట్ర సమి­తి సభ్యు­లు ఆం­దో­ళ­న­కు ది­గా­రు. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­పై వి­చా­ర­ణ­ను సీ­బీ­ఐ­కి అప్ప­గిం­చ­ను­న్న­ట్లు శా­స­న­సభ ని­ర్ణ­యిం­చ­డం­పై బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్సీ­లు భగ్గు­మ­న్నా­రు. ఈ ని­ర్ణ­యా­ని­కి వ్య­తి­రే­కం­గా మం­డ­లి ఛై­ర్మ­న్‌ పో­డి­యా­న్ని భారత రా­ష్ట్ర సమి­తి ఎమ్మె­ల్సీ­లు చు­ట్టు­ము­ట్టి ని­నా­దా­లు చే­శా­రు. జై తె­లం­గాణ ని­నా­దా­ల­తో హో­రె­త్తిం­చా­రు. కా­ళే­శ్వ­రం కమి­ష­న్‌ ని­వే­దిక ప్ర­తు­ల­ను భారత రా­ష్ట్ర సమి­తి సభ్యు­లు చిం­చి­వే­సి ఛై­ర్మ­న్‌ వైపు వి­సి­రా­రు. ‘రా­హు­ల్‌­కు సీ­బీఐ వద్దు.. రే­వం­త్‌­కు సీ­బీఐ ము­ద్దు’ అంటూ ని­నా­దా­లు చే­శా­రు. భారత రా­ష్ట్ర సమి­తి సభ్యుల తీ­రు­పై మం­డ­లి ఛై­ర్మ­న్‌ గు­త్తా సు­ఖేం­ద­ర్‌­రె­డ్డి అస­హ­నం వ్య­క్తం చే­శా­రు. పో­డి­యం వద్ద­కు రా­వొ­ద్ద­ని.. కే­టా­యిం­చిన స్థా­నా­ల్లో­నే ని­ర­సన తె­ల­పా­ల­ని సూ­చిం­చా­రు. భారత రా­ష్ట్ర సమి­తి ఎమ్మె­ల్సీల ని­ర­స­నల మధ్యే మం­త్రు­లు బి­ల్లు­ల­ను సభలో ప్ర­వే­శ­పె­ట్టా­రు. అనం­త­రం పం­చా­య­తీ­రా­జ్‌ చట్ట­స­వ­రణ, పు­ర­పా­లక సం­ఘాల చట్ట­స­వ­రణ, అల్లో­ప­తి­క్‌ ప్రై­వే­టు వై­ద్య సం­ర­క్షణ సం­స్థల చట్టం రద్దు బి­ల్లు­లు సభ ఆమో­దం పొం­ది­న­ట్లు మం­డ­లి ఛై­ర్మ­న్‌ ప్ర­క­టిం­చా­రు. కా­ళే­శ్వ­రం వై­ఫ­ల్యా­ని­కి కా­ర­ణం కే­సీ­ఆ­రే­న­ని బ్యా­రే­జీల ప్ర­తి అం­శం­లో­నూ ఆయన జో­క్యం చే­సు­కు­న్న­ర­ని జస్టి­స్ పీసీ ఘోష్ కమి­ష­న్ పే­ర్కొం­ది. చట్ట ప్ర­కా­రం ఆయ­న­పై చర్య తీ­సు­కు­నే స్వే­చ్ఛ కూడా ప్ర­భు­త్వా­ని­కి ఉం­ద­ని ఈ ని­వే­దిక స్ప­ష్టం చే­సిం­ది.

Tags

Next Story