TS: అటవీశాఖ అధికారులపై గ్రామస్తుల దాడి..!

TS: అటవీశాఖ అధికారులపై గ్రామస్తుల దాడి..!
X

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో అటవీ శాఖ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహిం చారు. కార్డెన్ సెర్చ్‌లో పలు ఇళ్లలో దొరికిన కలప దుంగలు, ఫర్నిచర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అటవీ అధికారులపైగ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జాదవ్ నౌశిలాల్ అనే బీట్ ఆఫీసర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే అటవీ శాఖకు సంబంధిం చిన ఓ వాహనం పై దాడి చేసి అద్దాలు పగలకొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భారీగా బలగాలను మోహరించారు. దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story