TGPSC: గ్రూప్ -4 తుది ఫలితాలు విడుదల

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికైన మొత్తం 8,084 మంది అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లు, ఎంపికైన పోస్టు వివరాలతో ప్రొవిజినల్ ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష గతేడాది జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 80శాతం మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించిన TGPSC.. ధ్రువపత్రాలు, ఇతర అన్ని వెరిఫికేషన్ ప్రక్రియలను పూర్తి చేసి తాజాగా 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్ జాబితాను ప్రకటించింది.
గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్
TG: ఈనెల 17, 18న గ్రూప్-3 పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు TGPSC ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లను https: //www. tspsc. gov. in వెబ్‌సైట్‌లో చూసుకోవాలంది. కాగా, 380కి పైగా పోస్టులకు 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
గ్రూప్-3 నిర్వహణకు ఏర్పాట్లు: సీఎస్ శాంతికుమారి
TG: ఈనెల 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షలను సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు. కాగా, గ్రూప్-3 పరీక్షకు 1401 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు హాజరుకానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com