TGSRTC: తెలంగాణలో మళ్లీ ఆర్టీసీ సమ్మె సైరన్

టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల సాధన కోసం మే 6 నుంచి సమ్మె చేయనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీసులు అందజేసింది. జనవరి 27న సమ్మెకు దిగుతామని నోటీసులు ఇచ్చినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మరోసారి సమ్మెకు సిద్ధమైంది. తమ సమ్మెకు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, అన్ని యూనియన్లు కలిసిరావాలని విజ్ఞప్తి చేసింది.కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించింది. తమ సమ్మెకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని యూనియన్లు మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ కోరింది. అయితే.. ఆర్టీసీ జేఏసీ ప్రత్యక్ష సమ్మెకు దిగితే.. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. మరి ఆర్టీజీ జేఏసీ ప్రత్యక్ష సమ్మెపై యజమాన్యం ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.
ఆర్టీసీకి బీఆర్ఎస్ రూ.8 కోట్లు
మరోవైపు.. టీజీఎస్ ఆర్టీసీ సంస్థకు బీఆర్ఎస్ పార్టీ రూ.8 కోట్లు అందించింది. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో.. సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో సభ ఏర్పాటు చేసింది. సభకు భారీగా జనాలను తరలించాలని భావిస్తోంది. ఈ సభకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ నుంచి 3 వేల బస్సులు అద్దెకు తీసుకుంటోంది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగబాలు, కురువ విజయ్ కుమార్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిశారు. బస్సుల అద్దెకు అయ్యే మొత్తం రూ. 8 కోట్ల చెక్కును సజ్జనార్‌కు బీఆర్ఎస్ నేతలు అందజేశారు. ఈ సభను విజయవంతం చేయాలని కేసీఆర్ నేతలకు పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com