TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
X
డిమాండ్లు నెరవేరే కొనసాగుతుందన్న ఆర్టీసీ నేతలు

తె­లం­గా­ణ­లో మరో­సా­రి ఆర్టీ­సీ ఉద్యో­గు­లు సమ్మె­కు ది­గేం­దు­కు రెడీ అయ్యా­రు. ఈ మే­ర­కు ఆర్టీ­సీ యా­జ­మా­న్యా­ని­కి తా­జా­గా జే­ఏ­సీ నే­త­లు సమ్మె నో­టీ­సు­లు ఇచ్చా­రు. గతే­డా­ది సమ్మె చే­సేం­దు­కు రెడీ అయిన ఆర్టీ­సీ కా­ర్మి­కు­లు.. ప్ర­భు­త్వ హా­మీ­తో వె­న­క్కి తగ్గా­రు. తమ సమ­స్య­ల­ను పరి­ష్క­రిం­చు­కు­నే వరకు ఈసా­రి సమ్మె­ను వి­ర­మిం­చ­కూ­డ­ద­ని ఆర్టీ­సీ కా­ర్మిక సం­ఘా­లు కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­యి. ఈసా­రి ఎలాం­టి పరి­స్థి­తు­ల్లో డి­మాం­డ్ల­ను సా­ధిం­చు­కు­నే వరకు వె­న­క్కి తగ్గ­కూ­డ­ద­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నా­యి. ఈ నే­ప­థ్యం­లో­నే తా­జా­గా ఆర్టీ­సీ ఎండీ నా­గి­రె­డ్జి­కి.. ఆర్టీ­సీ కా­ర్మిక సం­ఘా­లు సమ్మె నో­టీ­సు­లు ఇచ్చా­యి. రెం­డు వా­రా­ల్లో­పు ప్ర­భు­త్వం స్పం­దిం­చ­కుం­టే సమ్మె తప్ప­ద­ని నే­త­లు హె­చ్చ­రిం­చా­రు. ఈ నే­ప­థ్యం­లో­నే సమ్మె తే­దీ­పై రెం­డు వా­రాల తర్వాత ని­ర్ణ­యం తీ­సు­కో­ను­న్నా­రు.

కీలక డిమాండ్లు

తె­లం­గాణ ఆర్టీ­సీ ఉద్యో­గు­లు ఎప్ప­టి నుం­చో రా­ష్ట్ర ప్ర­భు­త్వం­లో వి­లీ­నం చే­యా­ల­ని డి­మాం­డ్ చే­స్తు­న్న వేళ.. ఆ ప్ర­క్రి­య­ను వెం­ట­నే చే­ప­ట్టా­ల­ని ఆర్టీ­సీ జే­ఏ­సీ నే­త­లు ప్ర­ధా­నం­గా డి­మాం­డ్‌ చే­శా­రు. అదే సమం­య­లో 2021 వేతన సవ­ర­ణ­ను 30 శాతం ఫి­ట్‌­మెం­ట్‌­తో అమలు చే­యా­ల­ని ఆర్టీ­సీ కా­ర్మి­కు­ల­కు పే­ర్కొ­న్నా­రు. అదే సమ­యం­లో రే­వం­త్ రె­డ్డి నే­తృ­త్వం­లో­ని కాం­గ్రె­స్ సర్కా­ర్ అమలు చే­స్తు­న్న మహా­ల­క్ష్మి పథకం కింద ప్ర­తి­నె­లా రూ.350 కో­ట్ల­ను ఎలాం­టి కో­త­లు లే­కుం­డా ఆర్టీ­సీ­కి ఇవ్వా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. ప్ప­టి­కే రా­ష్ట్ర ప్ర­భు­త్వం నుం­చి ఆర్టీ­సీ­కి రా­వా­ల్సిన రూ.2,500 కో­ట్ల పాత పెం­డిం­గ్ బకా­యి­ల­ను తక్ష­ణ­మే రి­లీ­జ్ చే­యా­ల­ని ఆర్టీ­సీ కా­ర్మిక సం­ఘా­లు డి­మాం­డ్ చే­శా­యి. అదే సమ­యం­లో ఆర్టీ­సీ­లో పని­చే­స్తు­న్న కా­ర్మి­కు­ల­కు ఉద్యోగ భద్రత కల్పిం­చా­ల­ని పే­ర్కొ­న్నా­రు. ఆర్టీ­సీ ట్రే­డ్‌ యూ­ని­య­న్ల­పై ప్ర­భు­త్వం గతం­లో వి­ధిం­చిన ఆం­క్ష­ల­ను పూ­ర్తి­గా ఎత్తి­వే­సి.. వెం­ట­నే గు­ర్తిం­పు సంఘం ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చా­ల­ని తె­లి­పా­రు. ఆర్టీ­సీ­లో­ని అన్ని వి­భా­గా­ల్లో పని­చే­స్తు­న్న కా­ర్మి­కు­లు, ఉద్యో­గు­ల­పై ప్ర­స్తు­తం ఉన్న అధిక పని­భా­రా­న్ని తగ్గిం­చా­ల­ని జే­ఏ­సీ నే­త­లు డి­మాం­డ్‌ చే­శా­రు. ఇప్ప­టి­కే ఆర్టీ­సీ యా­జ­మా­న్యా­ని­కి సమ్మె నో­టీ­సు ఇచ్చిన కా­ర్మిక జే­ఏ­సీ నే­త­లు.. తమ పో­రా­టా­న్ని మరింత ఉద్ధృ­తం చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు.

Tags

Next Story