తెలంగాణ

Minister KTR : గత పాలకులు పదవులు అనుభవించారు తప్ప అభివృద్ధి చేయలేదు : మంత్రి కేటీఆర్‌

Minister KTR : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నందికొండలో బుద్ధవనాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

Minister KTR :  గత పాలకులు పదవులు అనుభవించారు తప్ప అభివృద్ధి చేయలేదు : మంత్రి కేటీఆర్‌
X

Minister KTR :నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నందికొండలో బుద్ధవనాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దేశంలో పేరొందిన బౌద్ధక్షేత్రంగా బుద్ధవనం ప్రాజెక్టు విలసిల్లడం ఖామయని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశనలుమూల నుంచి బౌద్ధులు తరలివచ్చేలా పర్యాటక క్షేత్రంగా అభివృద్ది చేసినట్లు చెప్పారు. బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభించి, వదిలేశాం అన్నట్లుగా కాకుంగా ప్రపంచ స్థాయిలో పేరు వచ్చేలాగా మెయింటెన్‌ చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామని కేటీఆర్‌ చెప్పారు.

అనంతరం హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంభందించి 56 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. గత పాలకులు పదవులు అనుభవించారు తప్ప అభివృద్ధి చేయలేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని చెప్పారు. నూతన స్టేడియం నిర్మాణం కోసం౩ కోట్లు, ఓపెన్‌ డ్రైనేజీ కోసం 15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో వచ్చే నేతలను నమ్మోద్దని ప్రజలను కోరారు.

Next Story

RELATED STORIES