Hyderabad : ఎనిమిదేళ్ల కొడుకుని రైలెక్కించి.. పెద్దయ్యాక తిరిగిరమ్మన్న తల్లి..

Hyderabad : ఎనిమిదేళ్ల కొడుకుని రైలెక్కించి.. పెద్దయ్యాక తిరిగిరమ్మన్న తల్లి..
Hyderabad : అల్లరి చేస్తున్నాడని ఎనిమిదేళ్ల కొడుకుని అమ్మ రైలెక్కించి తిరిగి రావొద్దంది. నీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడైనా బతుకు. బాగుపడితే పెద్దయ్యాక తిరిగి రా అని తల్లి తన కోపాన్నంతా కొడుకు మీద ప్రదర్శించింది.

Hyderabad: అల్లరి చేస్తున్నాడని ఎనిమిదేళ్ల కొడుకుని అమ్మ రైలెక్కించి తిరిగి రావొద్దంది. నీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడైనా బతుకు. బాగుపడితే పెద్దయ్యాక తిరిగి రా అని తల్లి తన కోపాన్నంతా కొడుకు మీద ప్రదర్శించింది.

పిల్లలు అల్లరి చేస్తే, చెప్పిన మాట వినకపోతే ఎన్నో అంటాం.. కానీ ఆ కాసేపే.. మళ్లీ మామూలే.. నిజంగానే ఆ మాటలకు పిల్లలు అలిగి కాసేపు బయటకు వెళ్లిపోతే, లేదా కనిపించకపోతే అమ్మ ఆరాట పడిపోతుంది. తల్లి మనసు చిన్నారి కోసం తల్లడిల్లిపోతుంది.

ఎక్కడున్నారో, ఏమైపోయారో అని పిల్లల్ని నిందించినందుకు తనని తాను తిట్టుకుంటుంది. తిరిగి బిడ్డ కనిపించగానే ఇంకెప్పుడు ఇలా అనను అని ముద్దులు పెట్టుకుంటుంది. కానీ మరి ఆ అమ్మకి అంత కోపం వచ్చేలా వాడెందుకు అంత అల్లరి చేశాడో.. కనిపించినా కాదు పొమ్మంది.

నగరంలోని రామంతాపూర్‌కు చెందిన అంబికకు కుమారుడు మణికంఠ ఉన్నాడు. భర్త మరణించడంతో మరో వివాహం చేసుకుంది. వారికి కూతురు పుట్టింది. అయితే కుమారుడు మణికంఠ మాటవినకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడని ఆమెకు విసుగెత్తిపోయింది. మందలించింది, బెదిరించింది. అయినా మణికంఠ మారలేదు.

దాంతో ఆ తల్లి మంగళవారం సాయింత్రం సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఎక్కించింది. ఎక్కడైనా బతుకు తిరిగి పెద్దయ్యారా రా అని చెప్పింది. ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో తెలియని వయసు.. బిక్కుబిక్కుమంటూ అటూ ఇటు ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గమనించిన కొందరు స్టేషన్‌ఘన్‌పూర్ ఠాణాలో అప్పగించారు.

బాలుడి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు బుధవారం తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేశారు. అయినా వారు తమతో కుమారుడిని తీసుకువెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో చేసేందేం లేక పోలీసులు బాలుడిని చైల్డ్‌లైన్ ప్రతినిధులకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story