TRS MLC : టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల పేర్లు దాదాపు ఖరారు... !

TRS MLC : టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఈ సాయంత్రం ఆరుగురు అభ్యర్ధుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్, తక్కెళ్లపల్లి రవీందర్ పేర్లు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. గుత్తా సుఖేందర్, తక్కెళ్లపల్లి రవీందర్‌కు ఇప్పటికే సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ వెళ్లినట్టు తెలుస్తోంది.
జాబితాలో కడియం శ్రీహరి పేరు కూడా ఉన్నప్పటికీ.. ఆఖరి నిమిషంలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను మండలికి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు ఖరారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం పలువురు నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ఈ సాయంత్రం తరువాత అభ్యర్ధుల పేర్లు ఖరారవుతాయని, రేపు నామినేషన్ వేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ మధ్యే టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్. రమణ, కౌశిక్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ఎల్.రమణ, కౌశిక్ రెడ్డి సేవలను ఉపయోగించుకుంటామని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. దీంతో సాయంత్రం విడుదలయ్యే లిస్టులో తమ పేర్లు ఉంటాయా ఉండవా అనే ఉత్కంఠలో ఉన్నారు ఆశావహులు.
మరోవైపు, ఆల్రడీ మండలి సభ్యులుగా కొనసాగుతున్న వాళ్లు.. మరోసారి తమకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలంటూ సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com