Telangana Teachers: తెలంగాణలో టీచర్ల ఆస్తుల ప్రకటన చేయాలన్న ఆదేశాలు రద్దు..

Telangana Teachers: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీచర్ల ఆస్తుల ప్రకటనకు బ్రేక్ పడింది. విద్యాశాఖ సంచాలకులు జారీ చేసిన ఆదేశాలు రద్దయ్యాయి. నిలిపివేత ఆదేశాలు తక్షణం అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. విద్యాశాఖ సంచాలకుల ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. టీచర్లు తమ వార్షిక ఆస్తులు ప్రకటించాలని విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేసారు.
బంగారం, వెండి, స్థిర, చరా ఆస్తుల కొనుగోలు సహా అన్ని లెక్కలు చెప్పాల్సిందే అని స్పష్టంచేశారు. అంతేకాదు.. ఇకపై ఏవి కొనాలన్నా, అమ్మాలన్నా ముందుగా విద్యాశాఖకు తెలుపాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో తెలంగాణ వ్యాప్తంగా టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలపై మండిపడిన ఉపాధ్యాయులు తక్షణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం.. విద్యాశాఖ సంచాలకుల ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com