తాళాలు పగలకొట్టి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఆక్రమణ

తాళాలు పగలకొట్టి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఆక్రమణ
X
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తాళాలు పగలకొట్టి.. అక్రమించుకున్నారు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడురు వాసులు

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తాళాలు పగలకొట్టి.. అక్రమించుకున్నారు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడురు వాసులు. ఎవరికి నచ్చిన ఇంట్లోకి వారు ప్రవేశించారు. నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం గూడురులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 70 ఇళ్లు పూర్తి చేసింది. కానీ అధికారులు లబ్దిదారులను ఎంపిక చేయకపోవడంతో.. అవి నిరుపయోగంగా మారాయి. రేపు మాపు అంటూ తాత్సారం చేయడంతో.. ఓపిక నశించిన గ్రామస్తులు.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తాళాలను పగుల గొట్టారు. స్వీయ గృహప్రవేశాలు చేశారు. ఇళ్లను నిర్మించిన ప్రభుత్వం పేదలకు సకాలంలో అందించి ఉంటే తాము ఇలా తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాల్సిన అవసరం ఉండేది కాదంటున్నారు స్థానికులు.

Tags

Next Story