Sankranti Effect: పల్లెకు వెళ్లిన పట్నం.. సిటీ రోడ్లన్నీ ఖాళీ

Sankranti Effect: సంక్రాంతి అనగానే పండగ అంతా పల్లెటూళ్లలోనే కనిపిస్తుంది. పిల్లలకి సెలవులు కావడంతో హైదరాబాద్‌లోని జనం అంతా వారి గ్రామాలకు చేరుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. పండుగని దృష్ఠిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రత్యేక బస్సులు కేటాయించింది. ఔటర్ రింగ్ రోడ్లపై, టోల్ గేట్ల దగ్గర కార్లు క్యూ కడుతున్నాయి. బస్సులో వెళితే కరోనా సోకుతుందనే భయంతో ప్రజలు తమ సొంత వాహనంలో వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.
నగరం చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వారైతే బ్యాగులు, భార్యా పిల్లలతో టూ వీలర్ మీద కూడా ప్రయాణిస్తూ.. ఒక విధంగా రిస్క్ చేస్తున్నారు. పోలీసులు వారిస్తున్నా పట్టించుకోవట్లేదు.. రిస్కీ ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నారు. సంక్రాంతి పండుగ అందరిలో ఆనందాన్ని నింపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com