తెలంగాణలో ప్రస్తుతం 32,915 యాక్టివ్‌ కరోనా కేసులు

తెలంగాణలో ప్రస్తుతం 32,915 యాక్టివ్‌ కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2511 కేసులు..

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2511 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 305 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఒక్కరోజులోనే 11 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షా 38 వేల 395కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 877కు పెరిగిందని వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. ఇప్పటివరకు కరోనాతో చికిత్స తీసుకుని లక్షా 4 వేల 603 మంది డిశ్చార్‌ కాగా... 32 వేల 915 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వెల్లడించింది.

Tags

Next Story