స్కూటీపై వచ్చి లారీని అడ్డగించి.. గొల్లూరులో దొంగల బీభత్సం

స్కూటీపై వచ్చి లారీని అడ్డగించి.. గొల్లూరులో దొంగల బీభత్సం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లూరులో దొంగలు బీభత్సం సృష్టించారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని దొంగలు లారీని ఆపి కత్తులతో బెదిరించి రూ.15000 నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన శంషాబాద్ మండలం గొల్లూరు ఎక్స్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది.

వనపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న లారీని గొల్లూరు ఎక్స్ రోడ్డు వద్ద అడ్డగించిన దుండగులు కత్తులతో బెదిరించి నగదు దోచుకెళ్లారు. లారీ డ్రైవర్ రమేష్, రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story