Telangana : తెలంగాణలో మళ్లీ చలాన్ల మోత... మాస్కు ధరించకపోతే జేబులకు చిల్లులే
By - vamshikrishna |3 Dec 2021 6:44 AM GMT
Telangana : తెలంగాణలో మళ్లీ చలాన్ల మోత మొదలైంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు మాస్కు ధరించలేదా..? అయితే మీ జేబులకు చిల్లు పడకతప్పదు. కరోనా ఆంక్షలు పాటించనివారికి చలాన్ల వడ్డింపులు వేస్తున్నారు అధికారులు.
Telangana : తెలంగాణలో మళ్లీ చలాన్ల మోత మొదలైంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు మాస్కు ధరించలేదా..? అయితే మీ జేబులకు చిల్లు పడకతప్పదు. కరోనా ఆంక్షలు పాటించనివారికి చలాన్ల వడ్డింపులు వేస్తున్నారు అధికారులు. నిబంధనలు అతిక్రమిస్తే.. వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నారు. భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని... వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకోవాలని అధికారులు అంటున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మాటవిననివారిపై చలాన్ల వడ్డింపులు కూడా భారీగానే వేస్తున్నారు. హద్దు దాటారా... అంతే... చలాన్ల రూపంలో డబ్బులు వదిలించుకోవాల్సిందే.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com