RajaSingh: నీ తల నరికేస్తాం.. రాజాసింగ్‌కు బెదిరింపులు

RajaSingh: నీ తల నరికేస్తాం.. రాజాసింగ్‌కు బెదిరింపులు
X
మోదీ కూడా నిన్ను కాపాడలేరని బెదిరింపులు... ఫోన్ నెంబర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు.. మరోసారి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే పలుమార్లు రాజాసింగ్‌కు బెదిరింపులు రాగా తాజాగా మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గతంలోనూ పాకిస్థాన్‌, ఆఫ్గనిస్తాన్ కేంద్రంగా రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ రావడంతో పాటు ఆయనను హత్య చేసేందుకు కుట్ర కూడా జరిగిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లోనే రాజా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ వేరే కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు...విచారణ సందర్భంగా కీలక విషయాలు రాబట్టారు. తాము రాజాసింగ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నామని కూడా ఆ నిందితులు చెప్పడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.

రెండుసార్లు బెదిరింపు కాల్స్‌...

ఆదివారం తనకు రెండు ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ వచ్చినట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. " ఈరోజు కాకపోతే రేపు అయినా నీ తల నరికేస్తాం ఇన్షాల్లా. ఇప్పుడు మీ ప్రధాని నరేంద్ర మోదీ, మీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ కూడా నిన్ను రక్షించలేరంటూ ” అంటూ తనను ఫోన్ లో బెదిరించారని రాజా సింగ్ చెప్పారు.ఆ ఫోన్ నంబర్ల వివరాలను కూడా రాజాసింగ్ మీడియాకు వెల్లడించారు. +918986512926 నెంబర్ నుంచి మధ్యాహ్నం 3.45 నిమిషాలకు... +919434154614 నెంబర్ నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఫోన్ కాల్స్ వచ్చాయని రాజాసింగ్ వెల్లడించారు.

హిందువుల గొంతు నొక్కుతున్నారు..

గోషామహల్ MLA రాజాసింగ్ మీడియాకు కీలక విజ్ఞప్తి చేశారు. హిందువుల తరపున మాట్లాడినందుకు తన సోషల్ మీడియా ఖాతాలు నిషేధించారని, ఈ వ్యవహారంలో తనకు సపోర్ట్ చేయాలని మీడియాను కోరారు. హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న అణచివేతను, పక్షపాతాన్ని పూర్తిగా ఖండించాలన్నారు. యూఎస్ ఆధారిత సంస్థ ఒకటి తనతోపాటు కుటుంబసభ్యులు, స్నేహితులు కార్యకర్తల ఖాతాలపై కూడా నిషేధం విధించారని రాజాసింగ్ మండిపడ్డారు. వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులను ఎవరూ పట్టించుకోరని రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ముస్లింలకి షాపులు ఎందుకు ఇస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. భారతదేశంలో భావప్రకటన స్వేచ్చ ప్రమాదంలో పడిందని, అందుకు ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తుందన్నారు.

Tags

Next Story