Tomato Price : మార్కెట్లో చుక్కలు చూపిస్తోన్న టమాటా ధరలు .. కిలో ఎంతంటే?

Tomato Price : సామన్యులకి టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాదులో కిలో టమాటా ధర రూ. 80నుంచి రూ. 100 పలుకుతుంది... టమాటా సాగు తగ్గడంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు భారీగా తగ్గాయి. అంతేకాకుండా భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో ధరలు మండుతున్నాయి.
నిజానికి హోల్‌సేల్ మార్కెట్లకు నిత్యం 9వేల బాక్సుల్లో 2.25 లక్షల కేజీల టమాటా వచ్చేది. అప్పుడు ధర రూ.15లోపే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.. కేవలం 3 వేల టమాటా బాక్సులు మాత్రమే వస్తున్నాయి. ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.. మళ్ళీ కొత్త పంట వచ్చేవరకు ఇలాగే ధరలు ఉండొచ్చనని అంటున్నారు.
అటు చికెన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.. కిలో చికెన్ రూ. 310 నుంచి రూ. 320 వరకు పలుకుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటుగా నిత్యావసరధరలు కూడా పెరగడం, ఇప్పుడు అందులోకి టమాటో కూడా చేరడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com