భాగ్యనగరానికి భారీ పెట్టుబడులు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం.. జపాన్ పర్యటన కొనసాగుతోంది. టోక్యోలో నిర్వహించిన ఇండియా-జపాన్ భాగస్వామ్య రోడ్‌షోలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జపాన్‌లోని దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన రేవంత్ రెడ్డి బృందం... తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. లైఫ్ సైన్సెస్, జీసీసీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈవీ, టెక్స్‌టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని ఈ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్, జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్ నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం ప్రచార వీడియోలను రేవంత్ బృందం ప్రదర్శించింది.
భారీ ఏఐ డేటా క్లస్టర్
హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు తెలంగాణ ఒప్పందం ఒప్పందం చేసుకుంది. రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. టోక్యోలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరోవైపు రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com