తడిబట్టతో ఏ గుడికైనా వస్తా సిద్ధమా.. ఈటలకు రేవంత్‌ సవాల్‌

తడిబట్టతో ఏ గుడికైనా వస్తా సిద్ధమా.. ఈటలకు రేవంత్‌ సవాల్‌
మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ కాంగ్రెస్‌కు 25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు

బీజేపీ నేత ఈటల రాజేందర్ కు రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ కాంగ్రెస్‌కు 25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఫైర్‌ అయిన రేవంత్‌ ఇవాళ (శనివారం) సాయంత్రం ఆరు గంటలకు భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తానన్నారు. అయితే ఈటల రాజేందర్ కూడా రావాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్‌ నుంచి డబ్బులు తీసుకోలేదని గర్భగుడిలో నిలబడి ఒట్టేస్తానని రేవంత్‌ తెలిపారు. అయితే రాజేందర్‌ కూడా ప్రమాణం చేయాలని తెలిపారు. దిగజారి మాట్లాడొద్దన్న రేవంత్‌ భాగ్యలక్ష్మి గుడి వద్దంటే తడి బట్టతో ఏ గుడికైనా వస్తానని వెల్లడించారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన చందాలేనని పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్, బీజేపీ మధ్య చెలరేగిన మునుగోడు మంటలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బులు పంపిందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీఆర్ఎస్ నుంచి 25 కోట్ల రూపాయలు వచ్చాయన్నది జగమెరిగన సత్యమేనన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణానికి బొమ్మ బొరుసు లాంటివని.. ఎవరికి ఓటేసిన ఒకటే నంటూ విమర్శించారు ఈటల రాజేందర్.

ఈటల చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఇవాళ సాయంత్రం భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రమాణం చేద్దామా అంటూ ఈటలకు సవాల్ విసిరారు. తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమన్నారు రేవంత్‌ రెడ్డి. మునుగోడు ఎన్నికల్లోనే కాదు, కేసీఆర్ నుంచి అనా పైస కూడా ముట్టలేదని, మునుగోడులో ఖర్చుచేసిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలదే అని అన్నారు. రాజకీయాల కోసం ఈటల రాజేందర్ ఇంతలా దిగజారి మాట్లాడటం క్షమించరాని నేరమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను ఈటల 24 గంటల్లో నిరూపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story