Revanth Reddy : సీఎం కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు రెడీ... ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నా...!

Revanth Reddy : సీఎం కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఐదు నెలలుగా అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ అవినీతిని బయటపెట్టే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందని, బండి సంజయ్... అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇప్పిస్తారా అని సవాల్ విసిరారు. మోదీ, అమిత్‌షాలకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు.
ప్రాజెక్టులపై వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని, వాటి ఆధారాలు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఇస్తామన్నారు. సీబీఐ ఎంక్వైరీ వేస్తే అవినీతిని నిరూపిస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన డబ్బులను తమిళనాడు ఎన్నికలకు కిషన్ రెడ్డే తరలించారని ఆరోపణలు చేశారు.
సీఎం కేసీఆర్ వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నీళ్లు, నియామకాలను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టారని విమర్శించారు. సంజీవయ్య పార్క్‌ను మంత్రి తలసాని ఆక్రమించారని, విచారణకు ఆదేశించే ధైర్యం బీజేపీకి ఉందా అని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com