TPCC Chief Revanth Reddy: రాజకీయ కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే వార్‌రూంపై దాడి: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy: వార్ రూంపై దాడి చేసి 50 కంప్యూటర్లు ఎత్తుకెళ్లారని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాజకీయ కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే వార్‌రూంపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు మా డేటాను దొంగిలించారన్నారు రేవంత్. వార్ రూం ఫిర్యాదులు వచ్చాయని చెప్పారని.. ఐతే అరెస్టు చూపించమంటే చూపించలేదన్నారు. పోలీసులు కిరాయి గూండాల్లా వ్యవహరించారని మండిపడ్డారు. డీజీపీ,పోలీసు అధికారులు ఫోన్లకు స్పందించట్లేదని.. వార్ రూం సిబ్బందిని ఎక్కడా దాచారో తెలియదన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఆఫీసుపై పోలీసుల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీశాయి. పోలీసు సోదాలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. పలు చోట్ల కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. మల్లురవి, షబ్బీర్ అలీ, హరివర్ధన్ రెడ్డి, అనిల్ యాదవ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
అటు ఢిల్లీలోనూ నిరసనలకు సిద్ధమైంది కాంగ్రెస్. తెలంగాణ భవన్‌తో పాటు బీఆర్ఎస్ భవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ వార్‌రూమ్‌లో దాడికి నిరసనగా లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్. కేసీఆర్ సౌత్ ఇండియా హిట్లర్‌గా మారారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వార్‌రూంపై దాడి చేసే హక్కు పోలీసులకు ఎక్కడిదని,ఎలాంటి వారెంట్ లేకుండా ఆఫీస్‌లో హంగామా సృష్టించారని,. కేసీఆర్ ఫ్యామిలీపై ఫోస్ట్ పెడితే పోలీసులు రంగంలోకి దిగుతారా..? అంటూ ప్రశ్నించారు..
మరోవైపు సునీల్ కనుగోలుతో కాంగ్రెస్ లీగల్ టీం భేటీ అయింది. ఈ సమావేశంలో తదుపరి చర్యలపై చర్చించారు. కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వారిని ఎక్కడ ఉంచారో తమకు తెలియదంటున్నారు సునీల్ టీం సభ్యులు.
వార్ రూంపై దాడి చేసి 50 కంప్యూటర్లు ఎత్తుకెళ్లారని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాజకీయ కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే వార్‌రూంపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు మా డేటాను దొంగిలించారన్నారు రేవంత్. వార్ రూం ఫిర్యాదులు వచ్చాయని చెప్పారని..ఐతే అరెస్టు చూపించమంటే చూపించలేదన్నారు. పోలీసులు కిరాయి గూండాల్లా వ్యవహరించారని మండిపడ్డారు. డీజీపీ,పోలీసు అధికారులు ఫోన్లకు స్పందించట్లేదని..వార్ రూం సిబ్బందిని ఎక్కడా దాచారో తెలియదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com