Revanth Reddy : బరాబర్‌ ఫిబ్రవరి 17న నిరుద్యోగ దినోత్సవాన్ని జరుపుతాం : రేవంత్‌ రెడ్డి

Revanth Reddy : బరాబర్‌ ఫిబ్రవరి 17న నిరుద్యోగ దినోత్సవాన్ని జరుపుతాం : రేవంత్‌ రెడ్డి
X
Revanth Reddy : తెలంగాణ ఉద్యమానికి ఉత్ర్పేరకం యువతేనని... అటువంటిది ప్రభుత్వం తీరుతో ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

Revanth Reddy : తెలంగాణ ఉద్యమానికి ఉత్ర్పేరకం యువతేనని... అటువంటిది ప్రభుత్వం తీరుతో ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలేదని... నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో యువత రోడ్డున పడ్డారన్నారు. బిశ్వాల్‌ కమిటీ రిపోర్ట్‌ చేసిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అరెస్టుల పేరుతో విద్యార్థులను పోలీసులే గూండాలకు అప్పజెప్తున్నారని అన్నారు. డీజీపీ పదవికి మహేందర్‌ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో హక్కని... ఫిబ్రవరి 17న నిరుద్యోగ దినోత్సవాన్ని జరిపే తీరతామన్నారు. తమ నిరసన సెగ కేసీఆర్‌కు తగిలేలా చేస్తామన్నారు రేవంత్‌ రెడ్డి.

Tags

Next Story