Revanth Reddy : ఏప్రిల్ 1 నుంచి వరిధాన్యం కొనుగోలుపై పోరాటం చేస్తాం : రేవంత్ రెడ్డి

Revanth Reddy (tv5news.in)
X

Revanth Reddy (tv5news.in)

Revanth Reddy : ఏప్రిల్ 1వ తేదీనుంచి వరిధాన్యం కొనుగోలుపై పోరాటం చేస్తామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

Revanth Reddy : ఏప్రిల్ 1వ తేదీనుంచి వరిధాన్యం కొనుగోలుపై పోరాటం చేస్తామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని సమస్యలపై నిరంతరం పోరాడుతానే ఉంటామన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం భేటీలో చర్చించిన వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్లకు ఏప్రిల్ 1 నుంచి రెండు లక్షల ప్రమాద బీమా ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీతో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. పార్టీచేపడుతున్న కార్యక్రమాలు.. పోరాటలపై చర్చించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు.. సీనియర్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మధుయాష్కి, జీవన్ రెడ్డిలతోపాటు పలువురునేతలు హాజరయ్యారు.

Tags

Next Story