తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కొనసాగుతున్న సంప్రదింపులు

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. పార్టీ నేతలతో.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ చర్చలు జరుపుతున్నారు. పీసీసీ కోర్ కమిటీ సభ్యులతో బుధవారం మాణికం భేటీ అయి... వారి అభిప్రాయాలను సేకరించారు. అయితే ఎవరికివారు పీసీసీ చీఫ్ తమకే ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అందరితో చర్చించి ప్రజాస్వామ్య పద్ధతిలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని మాణికం ఠాగూర్ అన్నారు. గురువారం ఏఐసీసీ సభ్యుల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో సమావేశమై అభిప్రాయాలను తీసుకుంటారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్స్‌తో ఠాగూర్ భేటీ కానున్నారు.
అటు.. బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల్ని.. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఖండించారు. పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం లేదన్నారు. తనస్థాయి వ్యక్తిపై ఇలాంటి ప్రచారం చేయడం తగదన్నారు. ప్రతిపార్టీలోనూ పద్ధతులుంటాయన్నారు. సాగర్‌లో ఎవరు నిలబడతారో పార్టీ నిర్ణయిస్తుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com