ఆ ఇద్దరు కలిసి తెలంగాణ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు : రేవంత్‌రెడ్డి

X
కేసీఆర్, బండి సంజయ్ కలిసి తెలంగాణ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇద్దరు కలిసి ఎంఐఎంను ఆటవస్తువుగా మార్చుకున్నారని అన్నారు. ఎంఐఎం, బీజేపీ, టిఆర్ఎస్ ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బలహీనపర్చడానికి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి ఎంఐఎం సహకారం అందిస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ, ఎంఐఎంది తెరముందు కుస్తీ, తెర వెనుక దోస్తీ అని మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
