Traffic Challan Clearance: వాహనదారులకు గుడ్ న్యూస్.! ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ గడువు పొడిగింపు..

Traffic Challan Clearance: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మొదటిసారి చలాన్ల సేకరణ విషయంలో వినూత్నంగా ఆలోచించారు. అలా వచ్చిన ఐడియానే ట్రాఫిక్ చాలన్ల రాయితీ. ద్విచక్రవాహనాలు, ఆటోలకు చలాన్లలో 75 శాతం డిస్కౌంట్, నాలుగు చక్రాల వాహనాలకు చలాన్లలో 50శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు.. ఈ డిస్కౌంట్‌లో చలాన్లు చల్లించడానికి నెల రోజులు గడువు పెట్టినప్పుడు దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకే దీని గడువు పొడగిస్తున్నట్టుగా హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చలాన్ల విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అయితే అప్పటినుండి ఏ చిన్న ట్రాఫిక్ రూల్ పాటించకపోయినా వాహనదారులకు చలాన్ల మోత తప్పదు అన్నట్టుగా అయిపోయింది. అయితే ఇన్నాళ్లు పెండింగ్ ఉన్న చలాన్లపై డిస్కౌంట్ రావడంతో దీనికి విపరీతమైన రెస్పా్న్స్ వచ్చింది. దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ కూడా ఎక్కువే.
మార్చి 1 నుండి మార్చి 31 వరకు చలాన్లపై డిస్కౌంట్ వర్తిస్తుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ నెలరోజులే కావడంతో రోజుకు చాలామంది వాహనాదారులు ఈ-చలాన్ సైట్ ఓపెన్ చేస్తున్నారు. దీంతో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చలాన్లపై రాయితీ ప్లాన్‌ను మరో 15 రోజులు.. అంటే ఏప్రిల్ 15 వరకు పొడగిస్తున్నట్టుగా మహమూద్ అలీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com