Sound Pollution in Hyderabad: మీ బండి ఎక్కువ సౌండ్ చేస్తుందా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Sound Pollution (tv5news.in)

Sound Pollution (tv5news.in)

Sound Pollution in Hyderabad: శబ్దకాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

Sound Pollution in Hyderabad: శబ్దకాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పెద్దపెద్ద శబ్దాలు చేసే సైలెన్సర్లు బిగించిన వాహనదారుపై కేసులు నమోదుచేశారు. సైలెన్సర్లను తొలగించి రోడ్డురోలర్‌తో ధ్వంసం చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద బైక్ మెకానిక్‌, ఆటోమోబైల్ షాప్ యజమానులు, సౌండ్ పొల్యూషన్ పై అవగాహన కల్పించారు ట్రాఫిక్ పోలీసులు.

నిబంధనలకు విరుద్దంగా బైక్‌లకు సైలెన్సర్లను బిగించిన వాహనదారులపై కేసు నమోదుచేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఇవాళ ఒక్కరోజే వెయ్యి బైక్‌ సైలెన్సర్లను రోడ్డురోలర్‌తో ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. వాహనానికి సౌండ్, సైలెన్సర్ ఏవిధంగా ఉండాలనేది రిసెర్చ్‌ చేసిన తర్వాతే బైక్‌ను తయారుచేస్తారన్నారు.

సౌండ్ పొల్యూషన్ చేస్తూ కొందరుయువకులు బైక్ రేసింగ్‌కు పాల్పడుతున్నారని, శబ్ద కాలుష్యం వల్ల అనారోగ్యంతోపాటు.. హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. కావున ట్రాఫిక్ రూల్స్‌ ప్రతి ఒక్కరు పాటించాలని ఆయన వెల్లడించారు. వరుసగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామన్నారు. సౌండ్ పొల్యూషన్‌కి పాల్పడుతున్న వాహనాలపై 9 నెలల్లో 12వేల 938 కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

2019లో 4వేల 866 కేసులు నమోదుకాగా.. 2020లో 2వేల 163 కేసులు పెట్టినట్లువెల్లడించారు. 2021 సెప్టెంబర్ 30 నాటికి 12వేల 938 కేసులు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. అయితే అత్యంత శబ్దం చేస్తూ మొదటిసారి పటగ్టుబడితే.. వెయ్యిరూపాయలు జరిమానా.. అదే రెండవ సారి పట్టుబడితే.. 2వేల జరిమానా విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story