Guvvala Balaraju : గువ్వల బాలరాజుకు తలనొప్పిగా మారిన ఈటల గెలుపు.. రాజీనామా చేయాలంటూ డిమాండ్లు..!

Guvvala Balaraju : హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలవడం.... అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు..... తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఈ ఎన్నికలో ఈటల రాజేందర్..... గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గతంలో ఓ డిబేట్లో సవాల్ చేశారు. దీంతో గువ్వలబాలరాజుపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై..... బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించడంతో గువ్వల మాట మీద నిలబడాలంటూ ఆయనకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. తక్షణమే ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గువ్వల బాలరాజు ఎక్కడంటూ వాట్సాప్, ఫేస్బుక్ లో సెటైర్లు కొనసాగుతుండగా, కొందరు ఆయనకే నేరుగా ఫోన్ చేశారు. ఫోన్లు, ట్రోలింగ్ఎక్కువ కావడంతో గువ్వల ఫోన్స్విచ్చాఫ్ పెట్టుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com