BRS Party : తెలంగాణ వ్యాప్తంగా గులాబీ శ్రేణుల సంబరాలు..

BRS Party : తెలంగాణ వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సందర్భంగా గన్‌పార్క్ వద్దకు భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. బోరబొండ కార్పొరేటర్ ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లాలోనూ గులాబీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించడంతో.. అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చారు. అనంతరం స్థానిక ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. దేశ్‌కి నేత సీఎం కేసీఆర్ అంటూ కొనియాడారు. దేశానికి కేసీఆర్ దిక్సూచి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని ప్రకటించడంతో, స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోనూ బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు జరుకున్నారు. జై కేసీఆర్ అంటూ నినదించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్ ప్రకటనతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొంపల్లి మున్సిపాలిటీ, జీహెచ్‌ఎంసీలో పరిధిలోని ప్రధాన డివిజన్లలో ప్రధాన కూడళ్లలో టపాసులు పేల్చారు. స్థానిక నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు.
మహబూబ్ నగర్‌లో గులాబీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన సందర్భంగా టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద పెత్త ఎత్తున జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా నల్గొండలోని గడియారం సెంటర్‌లో స్థానిక నేతలు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com