Rahul Gandhi : రాహుల్‌గాంధీకి వైట్‌ ఛాలెంజ్‌ సవాల్‌ .. కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు

Rahul Gandhi : రాహుల్‌గాంధీకి వైట్‌ ఛాలెంజ్‌ సవాల్‌ .. కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు
X
Rahul Gandhi : రాహుల్‌గాంధీని వైట్‌ ఛాలెంజ్‌ చేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.

Rahul Gandhi : రాహుల్‌గాంధీని వైట్‌ ఛాలెంజ్‌ చేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌, ట్యాంక్‌బండ్‌పై వైట్ ఛాలెంజ్ ఫ్లెక్సీలు వెలిశాయి. వైట్‌ ఛాలెంజ్‌కి రాహుల్‌ గాంధీ సిద్ధమా అంటూ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టారు.

గతంలో మంత్రి కేటీఆర్‌ డ్రగ్స్ వాడారంటూ ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా అంటూ కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. రాహుల్‌గాంధీ పరీక్షలకు సిద్ధమంటే తాను కూడా సిద్ధమని అప్పట్లో ప్రకటించారు కేటీఆర్‌.

నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌గాంధీ కనిపించిన వీడియో వైరల్ అవడం, రేపు రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటిస్తుండడంతో వైట్‌ ఛాలెంజ్‌ సవాల్‌ ఏమైందని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి.

Tags

Next Story