Bathukamma songs : బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య బతుకమ్మ పాటల వార్ ..!

Bathukamma songs : హుజురాబాద్ ఎన్నికలలో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు.. ఇప్పటికే రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న ఇరుపార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఒకరిని మించి మరొకరు.. ఎత్తుకు పైఎత్తు అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం.
రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్లు దీనికోసం బతుకమ్మ పాటను కూడా వాడేసారు. తాజాగా కొందరు బీజేపీ కార్యకర్తలు.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతూ బతుకమ్మ పాట విడుదల చేశారు. ఫామ్ హౌస్‌లో ఉండే పాలన మాకొద్దు అంటూ సాగే పాటలో.. కేసీఆర్ వైఖరిపై విమర్శించడంతో పాటు.. ఆడిన మాట తప్పుతారని.. అబద్దపు వాగ్దానాలు చేస్తారని.. నిరుద్యోగులు, రైతుల బాధలు పడుతున్నారంటూ విమర్శించారు.
ఇక ఈటలకు ఓటేసి దొర ఆటలు కట్టిద్దాం అంటూ నినాదాలు చేశారు. మరోవైపు మేము ఏం తక్కువ కాదంటూ.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు మరో బతుకమ్మ పాటను రిలీజ్ చేశారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా బతుకమ్మ రూపంలో పాట పాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com