విద్యా, వైద్య రంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిచేయి చూపించింది : భట్టి
By - TV5 Digital Team |20 March 2021 9:30 AM GMT
విద్యా, వైద్య రంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.
విద్యా, వైద్య రంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన ప్రశ్నోత్తరాల వేళ బడ్జెట్‌లో కేటాయింపులపై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. భారీ బడ్జెట్‌లో ప్రాధాన్యత రంగానికి సరైన కేటాయింపులు లేవన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే ఆందోళన కలిగిస్తోందని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com