TRS Meeting: తెలంగాణ భవన్‌లో ఇవాళ టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం..

TRS meeting: తెలంగాణ భవన్‌లో ఇవాళ టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మధ్యాన్నం జరిగే ఈ సమావేశంలో.. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
రాబోయే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత పార్టీ యంత్రాంంగం ఏ విధంగా పని చేయాలన్న దానిపై చర్చిస్తారని సమాచారం. పార్టీ కమిటీలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై ఈ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించే అవకాశముంది. ఇక.. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నిక అనుభవాలు, ఓటింగ్‌పైనా చర్చించనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ప్రధానంగా బీజేపీ తీరును ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ పట్ల వైఖరి ఎలా ఉండాలనే దానిపైనా చర్చించనున్నారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలంతా తెలంగాణపై దృష్టి పెట్టిన నేపథ్యంలో.... టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరపనున్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భవం తర్వాతా.. తర్వాత జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలి?...అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాజకీయంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనే దానిపై కూడ చర్చించే అవకాశాలున్నాయి. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ..... రాష్ట్ర ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో ఏం చర్చిస్తారనే అంశం ఆసక్తిగా మారింది. దీంతో ఈ భేటీ తర్వాత.. సీఎం కేసీఆర్ మీడియా సమావేసం ఉంటుందంటున్నాయి పార్టీ శ్రేణులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com