TRS MLA Pilot Rohith Reddy: బండి సంజయ్‌కి భవిష్యవాణి తెలుసా.. : పైలట్ రోహిత్ రెడ్డి

TRS MLA Pilot Rohith Reddy: చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడికి చేరుకున్నారు BRS ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. ఈడీ ,సీబీఐలు బండి సంజయ్ కింద పనిచేస్తున్నాయా అని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్‌కి 24 గంటలు సమయం ఇస్తున్నానని, డ్రగ్స్ కేసులో నాకు సంబంధం ఉన్నట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు.. ప్రమాణం చేసేందుకు సంజయ్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
కాసేపట్లో సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు రోహిత్ రెడ్డి. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రను అడ్డుకున్నందుకే ఈ సమన్లు వచ్చాయన్నారు.. నాకు ఎటువంటి కేసుతో సంబంధము లేకుండా నోటీసు ఇవ్వడం దారుణమన్నారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈడీకి భయపడేది లేదని న్యాయ పరంగా బదులు ఇస్తానన్నారు.
మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది ఈడీ. వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారించనున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలు, కంపెనీల వ్యవహారాలపై ఈడీ రోహిత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో బండి సంజయ్ చెప్పిన రెండు రోజలకే ఈడీ సమన్లు వచ్చాయని, బండి సంజయ్‌కి భవిష్యవాణి తెలుసా.. నాకు నోటీసులు వచ్చే విషయం బండి సంజయ్‌కి ఎలా తెలుసు అని ఆయన ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com