నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత!

X
Kalvakuntla Kavitha Nizamabad Tour
By - Admin |22 Dec 2020 2:36 PM IST
ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి జిల్లా పర్యటనకు రావడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి జిల్లా పర్యటనకు రావడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కంటేశ్వర్ బూరుడు గల్లీ ప్రాంతంలో పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలను ఆమె పరామర్శించారు. ఆ తర్వాత బోర్గంలోని లక్ష్మీగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీగా గెలవడంతో ఆమె మొక్కులు తీర్చుకున్నారు. కవిత నగరంలో పర్యటిస్తుండగా కంటేశ్వర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మహిళను ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. బాధితురాలిని చూసి చలించిపోయిన కవిత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com