బుల్లెట్టు బండి పాటకు స్టెప్పులేసిన ఎంపీ కవిత...!

బుల్లెట్టు బండి పాటకు స్టెప్పులేసిన ఎంపీ కవిత...!
తెలంగాణలో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌‌లో ఉంది బుల్లెట్టు బండి పాట .. ఓ పెళ్లి బరాత్‌‌లో నవవధువు ఈ పాటకు డాన్స్ చేయడంతో పాట బాగా పాపులర్ అయింది.

తెలంగాణలో బుల్లెట్టు బండి సాంగ్‌ మామూలుగా మారుమోగడం లేదు. ఎక్కడ చూసినా అదే ఫీవర్‌. పెళ్లి వేడుకలైనా... బర్త్‌ డే పార్టీలైనా... చిన్నా పెద్ద తేడా లేకుండా పాట అందరినీ ఉర్రూతలూపుతోంది. ఈ పాటకు స్టెప్పులేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక సోషల్‌ మీడియాలో వ్యూస్‌కు లెక్కే లేదు. విద్యార్థుల నుంచి రాజకీయనేతల వరకు ఎవరైనా బుల్లెట్టు బండికి గుడుగుడు చప్పుడుకు పాదం కదపాల్సిందే. తాజాగా మహబూబాబాద్‌లో ఎంపీ మాలోతు కవిత బుల్లెట్టు బండి పాటకు స్టెప్పులేశారు. టీఆర్‌ఎస్‌ లీడర్‌ వెంకన్నగౌడ్ కుమారుడి పెళ్లి ఫంక్షన్‌లో ఆ పార్టీ రాష్ట్రనాయకురాలు కటికనేని హరితతో కలిసి బుల్లెట్టు బండెక్కి వచ్చెత్త పా అంటూ హుషారుగా డ్యాన్స్‌ చేశారు. పెళ్లికి గెస్ట్‌గా వచ్చిన ఎంపీ.. అందరితో కలిసి డ్యాన్స్‌ చేయడంతో ఫంక్షన్‌లో సందడి నెలకొంది. ఈ వీడియో పైన మీరు కూడా ఓ లుక్కేయండి..!


Tags

Read MoreRead Less
Next Story