Loksabha : లోక్‌సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్..

Loksabha : లోక్‌సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్..
X
TRS : ధరల పెంపు, జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు

TRS : ధరల పెంపు, జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు. సమావేశాల ప్రారంభంలోనే చర్చకు పట్టుబట్టారు టీఆర్‌ఎస్‌ పక్షనేత నామానాగేశ్వరరావు. ధరలు, ద్రవ్యోల్బణంపై ఆందోళన చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు.... స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి ప్లకార్డుల ప్రదర్శించారు. ప్రజాసమస్యలపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు. టీఆర్‌ఎస్‌తో పాటు డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ ఎంపీలు సైతం వాకౌట్‌ చేశారు.

Tags

Next Story