ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా గెలుపు

ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా గెలుపు
సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్గొండ-ఖమ్మం- వరంగల్‌ స్థానం నుంచి గెలుపొందారు.

తెలంగాణలో జరిగిన రెండు పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం విజయం సాధించింది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్గొండ-ఖమ్మం- వరంగల్‌ స్థానం నుంచి గెలుపొందారు. ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో విజయం కోసం అభ్యర్థులు దాదాపు నాలుగు రోజులు వేచిచూడాల్సి వచ్చింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి జరిగిన పోరులో అధికార టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచారు. పల్లారాజేశ్వర్‌రెడ్డికి 1 లక్ష 61 వేల 811 ఓట్లు రాగా.. తీన్మార్‌ మల్లన్నకు 1లక్ష 49వేల5 ఓట్లు వచ్చాయి. దీంతో 12,806 ఓట్ల మెజారిటీతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు.

ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో అభ్యర్థుల మధ్య పోటీ ఆది నుంచి ఉత్కంఠగా సాగింది. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొదటి నుంచీ ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థి గెలుపునకు 50 శాతానికి పైగా మెజారిటీ రాకపోవడంతో తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కో అభ్యర్థిని తొలగించుకుంటూ రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇక ఈ స్థానం నుంచి మొత్తం 71 మంది బరిలో నిలిచారు. మొత్తం 5,లక్షల 5వేల 565 ఓట్లు ఉండగా, 3లక్షల 87వేల 969 ఓట్లు పోలైనవి. వీటిలో 3లక్షల66వేల 333 చెల్లిన్నట్లు తెలిపారు. 21వేల 636 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్లలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1లక్ష 11,వేల 812 ఓట్లు రాగా.... స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 84,వేల 118 ఓట్లు వచ్చాయి.. తెలంగాణ జనసమితి తరఫున పోటీచేసిన ప్రొఫెసర్‌ కోదండరాంకు 71వేల 126, భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి 39వేల 306, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 27వేల729 ఓట్లు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story