TRS Party leaders: పాత పాట వినిపిస్తున్న పార్టీనేతలు.. కాబోయే సీఎం

X
By - Prasanna |21 Jun 2022 3:15 PM IST
TRS Party leaders: కేటీఆర్ సీఎం కావాలంటూ ఆకాంక్షను బయట పెట్టిన ఎమ్మెల్యేలు
TRS Party leaders: టీఆర్ఎస్ నాయకులు మరోసారి తమ మనుసులో మాట బయట పెట్టారు. యువనేత.. మంత్రి కేటీఆర్ సీఎం కావాలన్న కోరికను వెల్లడించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కైతలాపూర్‌లో రైల్వే ఓవర్
బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్‌లు.. కేటీఆర్ కాబోయే సీఎం అంటూ తమ మనసులో మాట
బయట పెట్టారు. వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆర్ సీఎంగా ఉంటారంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ప్రచారం జరుగుతుండగా.. ఈ నేతల మాటలతో వాటికి మరోసారి బలం చేకూరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com